*కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి*
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం జి వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు
గడిచిన 20 రోజుల్లో 2 ప్రమాదాలు జరగడంపై సీఎం శ్రీ వై ఎస్ జగన్ చర్చించారు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణాసంచా తయారీ కేంద్రాల్లో వెంటనే తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు
బాణసంచా తయారీ కేంద్రాల్లో లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు
వేమవరం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు
బాణసంచా తయారీ కేంద్రాల్లో అనుమతులపై ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీఎం ఆదేశించారు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లోపాలు ఉన్నా ఉపేక్షించేది లేదు
దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, అమ్మకాల వద్ద భద్రతా ప్రమాణాలపై నిఘా ఉంచాలని పోలీసులని ఆదేశించాం
నిన్నటి ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది